Select Language:   English  /  Hindi  /  Telugu  /  Kannada  /  Tamil

ఈ వారము ధ్యానం కొరకు - తండ్రి హృదయములో నుండి   (15/04/2018)

దేవుడు నిన్ను నియమిత స్థానములో నిలుపును

"ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను" (ఆది 41:14).  యోసేపు యొక్క జీవితములో యిది చాలా ప్రాముఖ్యమైన క్షణము.

దేవుడు ప్రతిచోటా తన బిడ్డలందరి జీవితాలలో నిర్వచనీయమైన అటువంటి సందర్భాలను తీసుకువస్తున్నాడు. రాజుముందు నిలువబడుటకు మన సమయము ఆసన్నమైనది. మనము తిరుగుబాటు స్వభావం, స్వార్ధ-జీవితము, అంధకారము మరియు బంధకములు అను చెరసాలనుండి బయటకు వస్తున్నాము. శత్రువు మనలను త్రోసివేసిన చెరసాలలోనుండి బయటకు వస్తున్నాము - అది ఆత్మీయసంబంధమైనదైనా, శరీరసంబంధమైనదైనా, ఆర్ధికసంబంధమైనదైనా లేదా మన సంబంధబాంధవ్యములోనైనా. మనము త్వరగా బయటకు తేబడుటకు దేవుడు ఆజ్ఞాపించెను; బయటకు వచ్చి ఆయన ముందు నిలువబడుటకు. ఈ అంత్యదినములలో ఆయన రాకడను త్వరితము చేయుటకు ఆయన మనకు ప్రత్యేకమైన పనిని నియమించి ఆజ్ఞను ఇవ్వబోవుతున్నాడు. "అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును" (ప్రకటన 7:15)

దేవుని ఆత్మ యోసేపులో ఉండెనని ఫరో సాక్ష్యమిచ్చెను. అదేవిధముగా నీ విషయములోకూడా దేవుని ఆత్మ నీలో ఉండెనని సాక్ష్యమివ్వబడును.

ఫరో తన చేతినున్న తన ముద్రఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసెను. పరలోకపు రాజు, మన ప్రియ ప్రభువైన యేసు నిన్ను గౌరవించును మరియు ఆయన అధికారమును నీకు నియమించును. శక్తి మరియు అధికారము యొక్క స్థలములో ఆయన నిన్ను నియమించును.

యిదంతా ఆయన రాకడకుముందు ఆయన ప్రజలను సిద్ధముచేయుటకు (పోషించుటకు) మరియు "యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు" అని ఆయన చెప్పెను. యోసేపువంటి అనేకమంది ఈ లోకమంతట అకస్మాత్తుగా వెలుగులోనికి తేబడుదురు. వారు ఎవరనగా ఆయన పనిని వారిలో స్వేచ్ఛగా పూర్తిచేయుటకు దేవునికి లోబడినవారు.  వారు దేవునికి సంబంధములేని వాటన్నిటినుండి తమను శుద్దిచేసుకుంటారు మరియు దేవునితో ఈ గొప్ప మహిమకరమైన దైవిక అన్యోన్యత లోనికి తమకుతాముగా వస్తారు.

దీని ద్వారా దేవుడు శేషమును సంరక్షించి గొప్ప విడుదల ద్వారా అనేకమందిని సజీవముగా నిలువును.

దేవుడు నిన్ను దీవించును గాక!

ఎస్ ఆర్ మనోహర్

Order Audio Sermons :                     View our various Audio Sermons

Recent Audio Sermons

Who is JESUS
This message is a foundation to knowing Jesus, knowing His character and His teaching. The Bible declares, “The people that do know their God shall be strong, and do exploits".

Ruth (Eng-Tamil)
This message is about the life of Ruth. God will give you a new beginning and He can change your situation and give you hope. This sermon was spoken at a meeting in Bangalore during the year 2006.

3 Great Promises (Eng-Telugu)  
This message was spoken during a crusade in the year 2001 at Nellore - Andhra Pradesh.

Wounds of Jesus (Eng-Telugu)
This message was spoken during a crusade in the 1990's at Nellore - Andhra Pradesh.

Knowing the Holy Spirit
Many people know 'about' the Holy Spirit but very few know the Holy Spirit personally. This message will lead you to know the Holy Spirit.