Select Language:   English  /  Hindi  /  Telugu  /  Kannada  /  Tamil

ఈ వారము ధ్యానం కొరకు - తండ్రి హృదయములో నుండి   (22/04/2018)

స్వార్థ స్థానంలోకి యేసు నింపబడెను

ఆదాము నుండి వారసత్వముగా నీవు పొందుకొనిన స్వార్ధ స్వభావమును నీ ఆత్మ నుండి యేసు తొలగించినప్పుడు, యేసు నీ ఆత్మలో ఆ స్థలమును తనతో నింపును. ఏవిధముగా అయితే దుష్టుడైన హామాను స్థానములో మొర్దెకై నియమించబడెనో ఆ విధముగా యిది జరుగును (ఎస్తేరు 8:2).  దేవునితో నీవు ఏకమవుటకు ఆటంకముగావుంటూ మరియు యేసుకు నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకొనుటను ఆపివేయుచున్న నీలోవున్న ఆ శత్రువు సంహరించబడును. గడచిన సంవత్సరములంతా నిన్ను నాశనము చేస్తున్నది చివరకు నాశనముచేయబడును (ఎస్తేరు 7:6, 10). పరలోకపు మొర్దెకై అయిన యేసు నీలో తనకు యోగ్యమైన స్థానమును తిరిగి పొందుకొనును. ఆయన నీ ద్వారా పరిపాలించును. యిదే ఆయన అసలైన ఉద్దేశ్యమైయున్నది.

పాపము నుండి శుద్దీకరించబడుట తక్షణమే జరుగును కానీ స్వార్ధము నుండి శుద్దీకరించబడుటకు దీర్ఘకాలము పడుతుంది. కానీ దేవుడు ఈ అంత్యదినములలో స్వార్ధము యొక్క మరణ ప్రక్రియను కూడా చాల వేగవంతము చేస్తున్నాడు. నీ ఆత్మ శుద్ధి చేయబడును మరియు దేవునితో ఐక్యమవును. నీవు యేసుతో ఐక్యమయినందువలన శత్రువు నీయందు భయపడెను.

దేవుడు నీ మీద తన ప్రేమను విలాసవంతముగా కుమ్మరించును. 23వ కీర్తన యొక్క ఆశీర్వాదములు అనుభవముగా మారును! ఇదే పరిశుద్దాత్మ యొక్క పరిపూర్ణత. పట్టువదలకుండా అడుగుతూ, వెదుకుతూ, తట్టుతూ ఉంటేనేగాని దీనిని నీవు పొందుకోలేవు.

ప్రత్యేకముగా ఆయన మహిమ మరియు ఘనత కొరకు దేవుడు తన మహా కనికరము చొప్పున దీనిని నీకు యిచ్చును - ఆయన రాజ్యము వచ్చుగాక మరియు ఆయన చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. యేసు మరియు ఆయన చిత్తము యందు నీ దృష్టిని కేంద్రీకరించాలి. నిన్ను నీవు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకో. ఆయన నీయందు ఆనందించును మరియు నీవు ఆయనయందు సంతోషించెదవు.

క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడు!

ఆశీర్వదించబడుడి!!

ఎస్ ఆర్ మనోహర్

Order Audio Sermons :                     View our various Audio Sermons

Recent Audio Sermons

Who is JESUS
This message is a foundation to knowing Jesus, knowing His character and His teaching. The Bible declares, “The people that do know their God shall be strong, and do exploits".

Ruth (Eng-Tamil)
This message is about the life of Ruth. God will give you a new beginning and He can change your situation and give you hope. This sermon was spoken at a meeting in Bangalore during the year 2006.

3 Great Promises (Eng-Telugu)  
This message was spoken during a crusade in the year 2001 at Nellore - Andhra Pradesh.

Wounds of Jesus (Eng-Telugu)
This message was spoken during a crusade in the 1990's at Nellore - Andhra Pradesh.

Knowing the Holy Spirit
Many people know 'about' the Holy Spirit but very few know the Holy Spirit personally. This message will lead you to know the Holy Spirit.