Select Language:   English  /  Hindi  /  Telugu  /  Kannada  /  Tamil

ఈ వారము ధ్యానం కొరకు - తండ్రి హృదయములో నుండి   (29/04/2018)

యేసుతో నీవు నింపబడినందువలన శత్రువు నీలోనుంచి వెళ్లగొట్టబడును

యెహోషువ ఈవిధముగా చెప్పెను "జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు." (యెహోషువ 3:10).

ప్రభువు నీ అంతరంగ లేదా వ్యక్తిగత జీవితములో అదేవిధముగా జరిగించును.

యొర్దాను నది చీలిపోవుట అనునది జీవముగల దేవుడు వారి మధ్య నున్నాడనుటకు ఒక సూచనగా ఉన్నది మరియు నిశ్చయముగా శత్రువు గోత్రములన్నిటిని వారి ముందు లేకుండా ఆయన వారిని పారద్రోలి,వారికి ఆ దేశమును యిచ్చును.

దేవుడే మన వాగ్దాన దేశము మరియు మనము ఆయన వాగ్దాన దేశము. ఒకరినొకరు పూర్తిగా స్వాధీనపరచుకొనుటకు సమయము ఆసన్నమయింది. జీవముగల దేవుడు తన సంపూర్ణత్వముతో మనలను నింపుననుటకు, పరిశుద్దాత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించుట సూచనగా ఉన్నది. మన అంతరంగ జీవితమునుండి శత్రువులనందరిని బయటకు పారద్రోలువాడు ఆయనే.మన పరలోకపు యెహోషువయయిన యేసు క్రీస్తు   మనలను ఆయన కొరకు పూర్తిగా తీసుకొనును మరియు మనలను సంపూర్ణముగా కలిగియుండును.

ప్రభువు దీనిని చేయును. ఆయన ఈ అనుభవములోనికి అనేకమందిని తనతోపాటు తీసుకొనివెళ్ళటానికి సిద్ధముగావున్నాడు. దేవుని స్వభావము మరియు గుణము యొక్క జ్ఞానమును సూచిస్తున్న వాగ్దాన దేశ ఫలమును మనము ఆశ్వాదిస్తాము. ఈ కార్యము దేవుని అమూల్యమైన ప్రేమ మరియు కరుణ వలన జరుగును. ఈవిషయములో ఎవరు కూడా మహిమను తీసుకోలేరు. సంపూర్ణ దీనత్వముతో మరియు కృతజ్ఞతతో నిండిన హృదయంతో మనమందరము ఆయన పాదములయొద్ద పడి, ఆయన గొప్ప ప్రేమకై నిత్యమూ ఆరాధించెదము. ఇదే అంత్యదినములలో పరిశుద్దాత్మ సంపూర్ణత.

ప్రయాస పడవద్దు అయితే ఆయన కరుణయందు నమ్మకముంచుడి. ఆయన సన్నిధిని (ముఖమును) నిత్యము వెదకుడి మరియు ఆయన వాక్యమును గౌరవించుడి. ప్రేమలో నడువుడి. యేసు నిన్ను ఆశీర్వదించును.

ఎస్ ఆర్ మనోహర్

Order Audio Sermons :                     View our various Audio Sermons

Recent Audio Sermons

Who is JESUS
This message is a foundation to knowing Jesus, knowing His character and His teaching. The Bible declares, “The people that do know their God shall be strong, and do exploits".

Ruth (Eng-Tamil)
This message is about the life of Ruth. God will give you a new beginning and He can change your situation and give you hope. This sermon was spoken at a meeting in Bangalore during the year 2006.

3 Great Promises (Eng-Telugu)  
This message was spoken during a crusade in the year 2001 at Nellore - Andhra Pradesh.

Wounds of Jesus (Eng-Telugu)
This message was spoken during a crusade in the 1990's at Nellore - Andhra Pradesh.

Knowing the Holy Spirit
Many people know 'about' the Holy Spirit but very few know the Holy Spirit personally. This message will lead you to know the Holy Spirit.